ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయి – పురందేశ్వరి

-

అమరావతి: సోమవారం ఓటరు అవగాహనపై బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి హాజరు కాగా.. వర్చువలుగా సమావేశంలో పాల్గొన్నారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా విషయమై ఏపీలో భారీగా అవతతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుల చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఓటని అన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు గతంలోనూ జరిగాయి.. ఇప్పుడూ జరుగుతున్నాయన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించడం వంటి సంఘటనలు చేసుకుంటున్నాయన్నారు. వేల సంఖ్యలో ఓట్ల విషయంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయన్నారు పురందేశ్వరి. ఉరవకొండ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్ అయ్యారని తెలిపారు.

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల ఇచ్చిన ఫిర్యాదులో సస్పెన్షన్ చేశారన్నారు. ఓటర్ల జాబితా పర్యవేక్షణ కోసం స్థానికంగా కమిటీలు వేయాలన్నారు. వలంటీర్ల ద్వారా ఓటర్ల జాబితాలో నిబంధనలకు విరుద్దంగా ఓటర్ల జాబితాలో చేరికలు.. తీసివేతలు జరుగుతున్నాయని ఆరోపించారు. వలంటీర్లు పంపిన సమాచారాన్ని క్రోడికరించి అవకతవకలకు పాల్పడేందుకు హైదరాబాదులో ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి వాటి విషయంలో బీజేపీ సీరియస్ గా వ్యవహరిస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news