తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను (ఆగస్టు 21న) విడుదల చేశారు. ఇందులో 7 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. వారి స్థానాల్లో ఇతరులకు కేటాయించారు. నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. కోరుట్ల ఎమ్మెల్యేగా ప్రస్తుతం విద్యాసాగర్ రావు ఉన్నారు. అనారోగ్యం కారణాల కారణంగా ఈసారి ఈయనకు టికెట్ కేటాయించకుండా విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ సంజయ్ కు కేటాయించారు.
దీనిపై విద్యాసాగర్ రావు స్పందించారు. “నా అభ్యర్థనను మన్నించి నా కుమారుడికి కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యధిక మెజారిటీతో మా అబ్బాయిని గెలిపిస్తామని మీకు మాట ఇస్తున్నాను. మీకు మరోసారి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు.