ఎమ్మెల్సీ కవితకు వైఎస్‌ షర్మిల కౌంటర్

-

33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఎక్కడ పాయె మీ చిత్తశుద్ధి..? అంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా..? అని నిలదీశారు. ఆకాశం, అధికారం సగం సగం అని శ్రీరంగ నీతులు చెప్పిన మీరే 6 శాతం ఇస్తే చిత్తశుద్ధి చూపినట్లా..? అని అడిగారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఆందోళన నిర్వహించిన విషయం సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన జాబితాలో ఏడుగురు మహిళలకు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవితను టార్గెట్ చేస్తూ.. ఇప్పటికే కాంగ్రెసక, బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.

YS Sharmila: Jagga Reddy cannot threaten YSR daughter: YS Sharmila

లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్‌ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి క్యాబినెట్‌లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించాలని హితవు పలికారు. లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప, మహిళల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పైన స్పందించిన పాపాన పోలేదన్నారు. రాజధాని నడిబొడ్డున ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నా, మీ పోలీసులు మహిళా రైతులకు బేడీలు వేసినా, స్టేషన్‌లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినా మీకు పట్టదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news