టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఫిర్యాదు చేశారు. లోకేష్ తనను హత్య చేసేందుకు కుట్ర చేసారని.. బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీకి ఫిర్యాదు చేసిన తరువాత పోసాని మంగళగిరిలో మీడియాతో ప్రసంగించారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పారు పోసాని. తనకు భద్రత కల్పిస్తానని డీజీపీ హామి ఇచ్చారు. లోకేష్ వల్ల తనకు ఉన్న ప్రమాదం గురించి డీజీపీకి వివరించినట్టు వెల్లడించారు.
టీడీపీలో చేరాలని లోకేష్ తనను కోరాడన్నారు. తాను టీడీపీలో చేరేందుకు అంగీకరించలేదన్నారు. లోకేష్ ఇగో హర్ట్ అయిందని పోసాని కృష్ణ మురళి చెప్పారు. ఎవరైనా ఆధారాలు చూపి హత్యలు చేస్తారా అని మీడియా ప్రతినిధులను పోసాని ప్రశ్నించారు. ఈనెల 22న కూడా పోసాని ప్రెస్ మీట్ పెట్టి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేంతేరులో లోకేష్ 14 ఎకరాల భూమి కొన్నారని.. తాను చేసిన ఆరోపణలపై తనపై లోకేష్ రూ.4కోట్లకు పరువు నష్టం దావా వేశారన్నారు. చంద్రబాబు, లోకేష్ ఆకృత్యాలను బయటపెట్టినందుకు తనపై పరువు నష్టం దావా వేశారని చెప్పారు పోసాని.