దొంగ ఓట్లు తొలగించాలని అధికారులకు దండం పెట్టి చెప్పా : మాజీమంత్రి బాలినేని

-

ఒంగోలు నియోజకవర్గంలో దొంగ ఓట్లు తొలగించాలని అధికారులకు దండం పెట్టి చెప్పాను అని మాజీ మంత్రి బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే ఏ పార్టీ వారైనా వచ్చి దొంగ ఓట్లు తీసేయించే కార్యక్రమం చేపట్టాలి అని పేర్కొన్నారు. గతంలో డబుల్ ఎంట్రీలు చేయించి దొంగ ఓట్లు చేర్పించారు. గత ప్రభుత్వ హయాంలో పదిహేను వేల దొంగ ఓట్లు చేర్పించారు.. సర్వే చేయించి మొత్తం తీసేయాలని అధికారులను ఆదేశించాను.

ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోజు రోజుకు దొంగ ఓట్లు ఎక్కువైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తులు ఎక్కువగా ఉన్న ఏరియాలలో దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలినేని. కేవలం ఒంగోలు లో మాత్రమే కాదని.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు దొంగ ఓట్లను అప్లై చేశారు. ఉన్న వారికే ఒకటి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. నకిలీ ఓటర్లను తీసివేయకపోతే వీటి వల్ల చాలా ప్రమాదకరమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news