ఖమ్మంలో కారుకు ధీటుగా కాంగ్రెస్.. అభ్యర్ధులు రెడీనా?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కే‌సి‌ఆర్ సీట్లు ఫిక్స్ చేశారు. ఒక్క వైరాలో తప్ప మిగిలిన సీట్లు యథావిధిగా ఇచ్చారు. ఇక వీరికి పోటీగా కాంగ్రెస్ సైతం బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేయడానికి రెడీ అవుతుంది.  ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాకతో ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది. దీంతో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం.

అయితే గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే కాంగ్రెస్ 6, టి‌డి‌పి 2, బి‌ఆర్‌ఎస్ 1, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. తర్వాత నలుగురు కాంగ్రెస్, ఇద్దరు టి‌డి‌పి, ఒక ఇండిపెండెంట్ బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. అలా వెళ్ళిన ఎమ్మెల్యేలకు కే‌సి‌ఆర్ సీట్లు ఇచ్చారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందులో హరిప్రియ, పినపాకలో రేగా కాంతరావు, పాలేరులో ఉపేందర్ రెడ్డి, అశ్వరావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లిలో వీరయ్య, మధిరలో కమల్ రాజు, భద్రాచలంలో తెల్లం వెంకట్రావు పోటీ చేస్తున్నారు. వైరాలో ఎమ్మెల్యే రాములుని పక్కన పెట్టి మదన్ లాల్‌ కు సీటు ఇచ్చారు.

ఇలా బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. అయితే కాంగ్రెస్ నుంచి కూడా బలమైన అభ్యర్ధులు పోటీ చేయడం ఖాయం. మధిరలో భట్టి విక్రమార్క, భద్రాచలంలో పోదెం వీరయ్య, కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్, పాలేరులో షర్మిల లేదా వేరే నేతకు సీటు. ఖమ్మంలో రేణుకా చౌదరీ గాని..వేరే నేతకు ఛాన్స్. ఇల్లందులో కోరం కనకయ్య, సత్తుపల్లిలో మానవతారాయ్ లేదా మట్టా దయానంద, అశ్వరావుపేటలో తాటి వెంకటేశ్వర్లు, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుందనే చర్చ ఉంది. చూడాలి మరి ఈ సారి ఖమ్మంలో ఎవరిది పైచేయి అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news