4 గంటల తర్వాత బయటకొచ్చిన రోవర్.. జాబిల్లిపై ప్రయోగాలు షురూ

-

చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టింది చంద్రయాన్-3. ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకున్న చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టిన తర్వాత ఇక.. తన అసలు పని షురూ చేయనుంది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రగ్యాన్ రోవర్ 14 రోజులు చంద్రుడిపై పరిశోధనలు చేయనుంది. సౌర శక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను రోవర్, ల్యాండర్ శోధిస్తాయి. ఇందుకోసం ఆధునిక పరికరాలను ఇస్రో జాబిలిపైకి పంపింది.

చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్​ అయ్యాక దాదాపు 4 గంటలకు దాని ర్యాంప్ విచ్చుకుంది. ల్యాండర్​లోని ఆరు చక్రాల ప్రగ్యాన్ రోవర్‌ జాబిల్లి ఉపరితలంపైకి ఇస్రో శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు. చంద్రుడి నేలపై అది సెకనుకు సెంటీమీటర్ వేగంతో నడక సాగిస్తూ పలు పరిశోధనలు చేపట్టనుంది. ల్యాండర్‌, రోవర్‌ జీవిత కాలం 14 రోజులు. చంద్రునిపై పగలు అంటే భూమిపై 14 రోజులతో సమానం. అందుకే సూర్యరశ్మి ఉండే 14 రోజులు సౌరఫలకాల సాయంతో శక్తి సమకూర్చుకుని ల్యాండర్‌, రోవర్‌ పరిశోధనలు నిర్వహిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news