రెండ్రోజుల్లో తెలంగాణ DSC నోటిఫికేషన్‌: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

-

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో తీపి కబురు అందించింది. తెలంగాణలో టీచర్‌ పోస్టుల భర్తీకి 2 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌లో  మీడియాతో మాట్లాడిన మంత్రి సబితా.. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. నియామకాల విషయంలో ఇప్పటికే భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు వచ్చాయని వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. అన్ని స్థాయిల విద్యా సంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని.. ఇంటర్‌, డిగ్రీ స్థాయిలో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

‘నియామకాల విషయంలో ఇప్పటికే భారీ సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. విద్యారంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారు. గురుకులాల్లో మనందరం గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయి.’ అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news