ఓటీటీలోకి వచ్చేసిన బ్రో, బేబీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్​లో వచ్చిన సినిమా బ్రో. తమిళ్ మూవీ వినోదాయసిత్తంకు రీమేక్​గా తెరకెక్కింది ఈ చిత్రం. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ గత నెలలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్​డ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే బ్రో సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇవాళ్టి నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

మరోవైపు ఈ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాల్లో చిన్న చిత్రంగా విడుదలై.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ బేబీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా యూత్​లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా బ్లాక్​బస్టర్ టాక్ తెచ్చుకుంది. సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఇవాళ అందుబాటులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news