‘అజిత్ మావోడే.. NCPలో చీలిక లేదు’.. శరద్ పవార్ సెన్సేషనల్ కామెంట్స్

-

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో చీలిక ఏర్పడలేదని.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తమ పార్టీ నాయకుడిగానే కొనసాగుతున్నారని అన్నారు. కొంతమంది నేతలు భిన్నమైన రాజకీయ వైఖరిని అనుసరించి ఎన్‌సీపీని విడిచిపెట్టారని.. అయితే దీనిని చీలికగా పరిగణించలేమని చెప్పారు. పుణె జిల్లాలోని తన స్వగ్రామమైన బారామతిలోని మీడియా సమావేశంలో శరద్ ఇలా వ్యాఖ్యానించారు.

“అజిత్ పవార మా నాయకుడని చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అతడితో మాకేం విభేదాలు లేవు. మా పార్టీలో చీలిక లేదు. అసలు పార్టీలో చీలిక ఎలా జరుగుతుంది? జాతీయ స్థాయిలో పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వెళ్లిపోతేనే చీలిక అవుతుంది. కానీ ఇప్పుడు ఎన్​సీపీలో అలాంటి పరిస్థితి లేదు. కొందరు నాయకులు భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో నిర్ణయం తీసుకోవడం వారి హక్కు. దానికే చీలిక అని మాట్లాడటం సబబు కాదు.” అని శరద్ పవార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news