సారీ తప్పు నాదే.. క్షమాపణ చెప్పిన మంత్రి తలసాని

-

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ బాబును నెట్టినందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆగస్ట్ 19, 2023న ఇందిరాపార్క్ వద్ద కొత్త స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. మంత్రి తలసాని, బాబును పట్టుకుని తోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చర్య ముఖ్యంగా బాబు సొంత జిల్లా ఆదిలాబాద్‌లోని గిరిజన వర్గాల్లో కలవరం రేపింది. గిరిజన నేత పట్ల అగౌరవంగా భావించి క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు.ఆందోళనలు పెరుగుతుండడంతో మంత్రి తలసాని స్పందిస్తూ చైర్మన్ బాబుకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు.

Talasani slams Revanth, Priyanka, BJP leaders

గిరిజనుల నిరసనలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగివచ్చారు. బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబుకు, గిరిజనులకు క్షమాపణ చెప్పారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ రోజూ కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఉండటంతో నా కాలు తొక్కుతూ ముందుకెళ్లాడటంతో గాయమై రక్తమొచ్చిందని, ఆ సందర్భంగానే నెట్టి వేశానన్నారు. చేయి చేసుకోవడం పొరపాటేనని, సోషల్ మీడియాలో దీన్ని పెద్దగా చేసే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన, దళిత, మైనార్టీ, గిరిజన వర్గాల గొంతుకను అని పేర్కొన్నారు. సేవాలాల్, కొమురం భీం జయంతులను ముందుండి చేస్తానని, ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణ చెప్పుతున్న అని పేర్కొన్నారు. బేషజాలకు పోవాల్సిన పరిస్థితి కాదని, అన్యతగా భావించవద్దని విజ్ఞప్తి చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news