డిగ్రీ కాలేజీ టీచర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త…!

-

డిగ్రీ కాలేజీ టీచర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్ హోదాను కల్పిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో-83ను జారీ చేశారు.

డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ గా 18 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు ఇకనుంచి ప్రొఫెసర్ హోదాను పొందనున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1523 స్పెషల్ టీచర్ల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో 18,857 మంది ప్రత్యేక అవసరాల విద్యార్థులు ఉండగా…. ప్రైమరీ స్కూళ్లలో 796 అలాగే హై స్కూల్ లలో 727 పోస్టులను మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 91 పోస్టులు అలాగే సిరిసిల్ల జిల్లాలో 20 పోస్టులు ఉన్నాయి. అంతేకాదు టీఆర్టీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news