మెదడు బాగా పని చేయాలంటే.. వీటిని తీసుకోండి..!

-

మెదడు బాగా పనిచేస్తే మంచి నిర్ణయాలను తీసుకోవడానికి అవుతుంది ఎన్ని పనులైనా సరే చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే మెదడు సరిగ్గా పని చేయకపోతే మనకి ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏ పని కూడా సక్రమంగా చేయలేము అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చు. అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ కాలేజ్ కి చెందిన న్యూట్రిషన్ సైకాలజిస్ట్లు ఈ విషయాలని చెప్పారు.

మెదడు పేగులు ఒకే కణాల నుండి తయారవుతాయట అందుకే మంచి ఆహారాన్ని తీసుకుంటే మెదడు పని తీరు బాగుంటుంది. ఆకలి నియంత్రణ ఇతర జీవక్రియలకు సంబంధించి 90%
సెరోటోనిన్ హార్మోన్స్ పేగుల్లో ప్రొడ్యూస్ అవుతుంది అందుకని మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి ముఖ్యంగా మెదడు పనితీరు బాగుండడం కోసం విటమిన్ బి విటమిన్ బి12 విటమిన్ బి 9 ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు వంటి వాటిల్లో ఇది ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ పువ్వు వంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండండి. పెరుగును తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. బ్రెయిన్ పవర్ ని కూడా ఇది పెంచుతుంది. యాంటీ ఇన్ఫ్లమెంటరీ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండడం వలన వాల్నట్స్ ని తీసుకుంటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది డార్క్ చాక్లెట్, తృణధాన్యాలు, పచ్చి బఠానీలు, పాలు వంటి ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండండి. అప్పుడు మెదడు పనితీరు బాగుంటుంది జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news