ఐటీఆర్‌ ఇంకా రిఫండ్‌ అవలేదా..? ఇలా చేయండి

-

పన్ను పరిధిలోకి జీతం ప్రతి ఉద్యోగి ఐటీఆర్‌ను ఫైల్‌ చేయాలి. గత నెలలోనే ఈ ప్రాసెస్‌ అంతా ముగిసింది. అర్హత ఉన్నవాళ్లకు రిటర్న్‌ కూడా వచ్చింది. అయితే కొంతమందికి రిఫండ్‌ వస్తుంది అని చూపించినా.. ఇంత వరకూ అకౌంట్‌లో అమౌంట్‌ పడలేదు. ఆదాయ పన్ను శాఖ లెక్కల ప్రకారం, జులై 31 అర్ధరాత్రి సమయానికి 6.77 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3.44 కోట్ల ఐటీఆర్ అప్లికేషన్ల రీఫండ్ ప్రక్రియ పూర్తయింది. ఇంకా చాలా మంది రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు.

సాధారణంగా రీఫండ్ ప్రాసెస్ పూర్తి కావడానికి కనీసం వారం నుంచి నాలుగు నెలలు పడుతుంది. అయితే, కొన్ని సార్లు ఇన్ కం ట్యాక్స్ రీఫండ్ ఆలస్యం అవుతుంది. దీనికి ప్రధానంగా ఐదు కారణాలు ఉంటాయి.

బ్యాంక్ వివరాలు తప్పుగా ఉంటే రీఫండ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది.
అదనపు డాక్యుమెంట్లు అవసరం పడినా సమయానికి రీఫండ్ రాదు.
ఐటీఆర్‌లో తప్పుడు సమాచారం పొందుపర్చడం, కంపెనీ సమర్పించే టీడీఎస్/టీసీఎస్‌‌కి ఉద్యోగి పొందుపర్చే టీడీఎస్/టీసీఎస్‌కి తేడా ఉండటం, అండర్ ప్రాసెస్‌డ్ రీఫండ్ వంటివి రీఫండ్‌ని ఆలస్యం చేస్తాయి.
వీటిల్లో ఏ ఒక్కటి జరిగినా రీఫండ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.

ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాక అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇ- ఫైలింగ్ వెబ్‌సైట్ అయిన incometaxindiaefiling.gov.in ని సంప్రదించవచ్చు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఇ-గవర్నెన్స్ వెబ్‌సైట్ tin.nsdl.com వెబ్‌సైట్‌ని ఆశ్రయించి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇ ఫైలింగ్ వెబ్‌సైట్‌లో స్టేటస్ చెక్ చేయడానికి లాగిన్ కావాల్సి ఉంటుంది.

యూజర్ ఐడీ(పాన్ కార్డ్ నంబర్), పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయాలి. అనంతరం, ఇ-ఫైల్(e-file) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ, ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్(Income Tax Return) సెలెక్ట్ చేసుకుని ‘View Filed Return’పై క్లిక్ చేయాలి. ‘View Details’ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఇటీవల ఫైల్ చేసిన ఐటీఆర్ స్టేటస్ కనిపిస్తుంది.

ఐటీఆర్ ఫైల్ చేశాక బ్యాంక్‌ అకౌంట్‌లో రీఫండ్ జమ కాకపోతే ఎందుకు కాలేదని తెలుసుకోవాలి. ముందుగా ఇమెయిల్ చెక్ చేసుకోవాలి. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ నుంచి ఏదైనా ఇమెయిల్ వచ్చిందేమోనని చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి అదనపు డాక్యుమెంట్లు కావాలని ఇమెయిల్ వస్తుంటుంది. ఒకవేళ ఈ ఇమెయిల్ వస్తే సరైన సమాధానం ఇవ్వాలి. అడిగిన డాక్యుమెంట్లను సమర్పించాలి. రీఫండ్ గడువు ముగిసిందని ఐటీఆర్ స్టేటస్‌లో చూపిస్తే రీఫండ్ రీఇష్యూ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మరోవైపు, ‘Returned’ అని స్టేటస్‌లో ఉంటే మళ్ళీ ఇ-ఫైలింగ్ పోర్టల్ లేదా అసెసింగ్ ఆఫీసర్ వద్ద రీఫండ్ రీఇష్యూ కోసం అప్లై చేసుకోవాలి.

ఐటీఆర్ ఫైలింగ్ అనంతరం 30 రోజుల్లో రీఫండ్ క్రెడిట్ కాకపోతే ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోవాలని ఆదాయ పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఏ కారణం తెలపలేకపోతే ఫిర్యాదు చేయొచ్చు. Incometax.gov.in వెబ్‌సైట్‌ని ఆశ్రయించవచ్చు. ఇదే కాకుండా, ఇన్ కం ట్యాక్స్ విభాగం టోల్ ఫ్రీ నంబర్ 1800-103-4455కి కాల్ చేయవచ్చు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news