సెప్టెంబర్‌ 2న ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్‌-3ని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రయాన్-3 జాబిల్లిపై సక్సెస్​ఫుల్​గా అడుగుపెట్టి తన పని షురూ చేయడంతో ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం వేదికగా సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సి57 రాకెట్‌ ద్వారా సెప్టెంబరు 2న కక్ష్యలోకి పంపాలని నిర్ణయించింది. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.

ఇస్రో చేపడుతున్న తొలి సౌర ప్రయోగం ఇది. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం బరువు 1500 కిలోలు కాగా ఈ ప్రాజెక్టు వ్యయం రూ.368 కోట్లు. సౌర కార్యకలాపాలు, అంతరిక్షంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్‌ పాయింట్‌-1 చుట్టూ ఉన్న కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. అక్కడికి చేరుకోవడానికి ఆదిత్య-ఎల్‌1కు నాలుగు నెలలు పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news