కాకినాడ జిల్లాలోని జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పర్యటించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.ఇర్రిపాకలోని ఎమ్మెల్యే చంటిబాబు నివాసానికి వెళ్లారు సీఎం. నూతన వధూవరులు అన్నపూర్ణ, సాయి ఆదర్శ్ లను ఆశీర్వదించారు. అంతకు ముందు ఇర్రిపాకలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం జగన్ కి సాదర స్వాగతం పలికారు.
అనంతరం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు జనసేన నేత రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా). 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా పోటీ చేశాడు రాయపు రెడ్డి ప్రసాద్. జనసేన పరిస్థితి ప్రస్తుతం బాగాలేదని.. అందుకే వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు ప్రసాద్. వైసీపీ అందరినీ కలుపుకుపోతుందని స్పష్టం చేశారు. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ యువజన నేత జక్కంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.