BREAKING : శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం…12 దుకాణాలు దగ్ధం

-

BREAKING : శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఏకంగా 12 దుకాణాలు దగ్ధం అయ్యాయి. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. శ్రీశైలంలోని లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే.. ఎల్ బ్లాక్ లో సుమారు 12 దుకాణాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి.

ఎల్ బ్లాక్ దుకాణాలలో షార్టుసర్క్యూట్ తో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో దుకాణాల్లో ఒకదానికొకటి మంటలు వ్యాపించాయి. ఈ తరుణంలోనే… సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది..భారీగా ఎగసిపడుతున్న మంటలను ఆర్పుతున్నారు. మంటలు చెలరేగిన దుకాణాలు వద్దకు చేరుకున్న ఈవో లవన్న.. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఇక దుకాణాల దగ్ధంతో సుమారు 1 కోటి నుండి 2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news