తెలంగాణలో 12 గంటల కంటే ఎక్కువ కరెంట్‌ ఉండటం లేదు – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

తెలంగాణలో కరెంట్ కోతల అంశం ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. జిల్లాల పర్యటనల్లో కేసీఆర్ 2,3 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలా…24 గంటలు కరెంట్ కావాలా అని ప్రజలకు చెబుతున్నారు…తెలంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా 12, 13 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

రానున్న రోజుల్లో ఇందులో కూడా కోత ఉండనుంది… రైతులకు కరెంట్ కోతతో ఇబ్బంది తప్పేలా లేదని చురకలు అంటించారు. ఇప్పటికీ నాకు కరెంట్ కోతపై నల్గొండ మండలం నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి..నల్గొండ మండలం అప్పాజీ పేటలో వారం నుంచి కనీసం 6గంటలు కూడా కరెంట్ రావడం లేదని ఆగ్రహించారు. పొలాలు ఎండిపోతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు..24 గంటలు ఇచ్చేంతా కరెంట్ మీద దగ్గర లేకపోతే చెప్పండని సీఎం కేసీఆర్ కు సవాల్‌ విసిరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మీ దగ్గర లేకపోయిన పక్కా రాష్ట్రాల నుంచి అయిన కోని ప్రజలకు 24 గంటల కరెంట్ ఇవ్వండి..ప్రభుత్వం మాటల నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news