ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే.. నెలకు రూ.50,000 పెన్షన్ వస్తుంది..!

-

మీరు ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి చూడండి. పన్ను ఆదా తో పాటు పెన్షన్ కూడా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలను తీసుకు వచ్చింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ఒకటి. గరిష్టంగా ఏడాదికి రూ.1,50,000 వరకు మినహాయింపు పొందవచ్చు.

సెక్షన్ 80సీలో రూ.1,50,000 లిమిట్ దాటిన వాళ్లు నేషనల్ పెన్షన్ స్కీమ్‌ లో పొదుపు చేసి అదనంగా రూ.50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి 75:25, 50:50, 40:60 ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి రిటర్న్స్ మీకు వస్తాయి. ఈ స్కీమ్ లో దీర్ఘకాలం పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. 25 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళు ఈ స్కీమ్‌లో పొదుపు చేయడం మొదలు పెట్టి… నెలకు రూ.4,000 చొప్పున కనుక ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్లకు రిటైర్ అవుతారు అనుకుంటే 45 ఏళ్ల పాటు పొదుపు చేస్తూ ఉండాలి.

45 ఏళ్లల్లో పొదుపు చేస్తే అప్పుడు మొత్తం రూ . 16,80,000 అవుతుంది . 9 శాతం చొప్పున రిటర్న్స్ చొప్పున రూ.99 లక్షల వడ్డీ ని వారు పొందవచ్చు. మొత్తం రూ . 1,16,57,803 జమ అవుతుంది. 35 శాతం అంటే రూ . 40 లక్షలు విత్‌డ్రా చేయచ్చు. మిగతా మొత్తం రూ . 75 లక్షలు 8 శాతం వచ్చే స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.50 వేల పెన్షన్ వస్తుంది. డబ్బులు విత్‌డ్రా చేసుకోకుండా మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే రూ.77 వేల పెన్షన్ ని మీరు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news