విశాఖలో వెస్ట్ బెంగాల్ విద్యార్థిని రితి సాహ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని రితి సాహ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విశాఖలో మృతి చెందిన విద్యార్ది రీతి సాహా కేసుపై ఏపీ హైకోర్టుకి తండ్రి సుఖ్ దేవ్ వెళ్లారు. సీసీ టీవీ ఫుటేజ్ సేకరణ కోసం ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే జూలై 1 నుంచి 16 వరకు సాధన హాస్టల్, 14, 15 తేదీల్లో వెంకట రామా హాస్పిటల్ లో సీసీ ఫుటేజ్ సేకరించాలని పిటిషన్ లో కోరాడు రీతి సాహా తండ్రి. ఈ సీసీ టీవీ ఫుటేజ్ లను తారు మారు చేయటం, నాశనం చేసే అవకాశాలు ఉన్నాయని పిటిషన్ వేశారు. అయితే విచారించి అడ్వకేట్ కమిషనర్ ను ఏర్పాటు చేసింది ఏపీ హైకోర్టు. అడ్వకేట్ కమిషనర్ విశాఖ వెళ్లి సీసీ టీవీ ఫుటేజ్ పై రిపోర్టును ఆగస్ట్ 28న హైకోర్టుకు అందజేశారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 27కి వాయిదా వాయిదా వేశారు.పిటిషన్ లో ప్రతివాదులు గా విశాఖ సీపీ, విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు, సాధన హాస్టల్, వెంకట రామ ఆసుపత్రి, కేర్ ఆసుపత్రి ఉన్నారు.