ముంబై వేదికగా నిన్న మరియు ఈ రోజు ఇండియా కూటమి లోని పార్టీల కీలక నేతలు అందరూ సమావేశం అయ్యి ముఖ్యమైన అంశాలపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఓడించాలన్న విషయం పైన ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ కూటమి మీటింగ్ కు అటెండ్ అయిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ పాలనలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని లాలూ బీజేపీ పై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ అధికార ధరల నుండి ప్రజలకు విముక్తిని కలిగించాలంటే బీజేపీ ఎన్నికల్లో ఓడించాలి అంటూ లాలూ అన్నారు. ప్రజలకు అని విధాలా రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీని దేశం నుండి పారద్రోలాలి అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు.
బీజేపీని ఓడించడానికి బీజేపీ హటావో దేశ్ బచావో అన్న మిషన్ స్టార్ట్ అయిందంటూ లాలూ మీడియా ముఖంగా తెలియచేశారు. మరి ఇండియా కూటమి అనుకున్నట్లుగా బీజేపీని ఓడిస్తుందా అన్నది రానున్న కాలంలో తెలిసే అవకాశం ఉంది.