మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందుతుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ నుండి బయటపడడానికి సునీల్ యాదవ్ తరపున లాయర్లు బెయిల్ కిశోరం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న సుని యాదవ్ బెయిల్ మీద బయటకు రావాలని భావించిన అందుకు హై కోర్ట్ తీర్పు ఇవ్వకుండా విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి సునీల్ యాదవ్ కు షాక్ ఇచ్చింది. సునీల్ యాదవ్ పెట్టుకున్న బెయిల్ పిటీషన్ పై విచారణ చేయగా, ఇందుకు సిబిఐ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతనికి బెయిల్ ఇవ్వకూడదని కౌంటర్ దాఖలు చేయగా.. దీనిని కారణంగా చూపిన హై కోర్ట్ కేసును ఈ నెల 8 కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇక సునీల్ యాదవ్ తరపు లాయర్లు తాను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఎంత వాదించినా ఉపయోగం లేకుండా పోయింది. మరి మరో వారం రోజుల్లో హియరింగ్ ఉన్నందున కోర్ట్ ఈ బెయిల్ పిటీషన్ పై ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.