ఓటీటీలోకి ‘ఉస్తాద్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి నటించిన తాజా చిత్రం ‘ఉస్తాద్‌’. ఆగస్టు 12న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఫణిదీప్‌ దర్శకత్వం వహించిన ఇందులో కావ్యా క‌ళ్యాణ్ రామ్‌ హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్​ను ఉస్తాద్​తో జాలీగా ఎంజాయ్ చేయండి మరి.

ఉస్తాద్ స్టోరీ ఏంటంటే : మ‌న‌సుకు న‌చ్చింది చేసుకుంటూ వెళ్లే కుర్రాడు సూర్య‌ (శ్రీసింహా). సూర్య‌కు ఎత్తైన ప్ర‌దేశాలంటే భ‌యం. అలాగే విప‌రీత‌మైన కోపం. డిగ్రీ చ‌దివే రోజుల్లో ఓ పాత కాలం నాటి బైక్‌ను ముచ్చ‌ట‌ప‌డి కొనుక్కుంటాడు. దానికి ఉస్తాద్ అని పేరు పెట్టుకుంటాడు. అది జీవితంలోకి వ‌చ్చాక త‌న ఆనందం.. బాధ‌.. క‌ష్టం.. సుఖం.. ప్ర‌తిదీ దానితోనే పంచుకోవ‌డం మొద‌లు పెడ‌తాడు. ఆ బైక్ వ‌ల్లే మేఘ‌న (కావ్యా క‌ల్యాణ్ రామ్‌) సూర్య జీవితంలోకి వ‌స్తుంది.  సూర్య‌కు పైల‌ట్ అవ్వాల‌న్న ల‌క్ష్యం ఏర్ప‌డుతుంది.  మ‌రి ఎత్తైన ప్ర‌దేశాలంటే భ‌య‌ప‌డే సూర్య పైల‌ట్ అవ్వాల‌న్న త‌న క‌ల‌ను ఎలా నెర‌వేర్చుకున్నాడు? ఈ క్ర‌మంలో త‌న‌కెదురైన స‌వాళ్లేంటి?  త‌న వ్య‌క్తిత్వం వ‌ల్ల ప్రేమ‌క‌థ‌లో వ‌చ్చిన చిక్కులేంటి?  ఈ ప్ర‌యాణంలో ఉస్తాద్ అత‌ని జీవితాన్ని ఎలా ప్ర‌భావితం చేసింది? అమెజాన్‌లో చూసి తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news