తిరుమల శ్రీవారికి భక్తులకు శుభవార్త అనే చెప్పాలి. సెప్టెంబర్ 18 నుంచి 26వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 17.09.2023 – ఆదివారం – అంకురార్పణ – రాత్రి 7 నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. అలాగే 18.09.2023 – సోమవారం – బంగారు తిరుచ్చి ఉత్సవం – మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ధ్వజారోహణం(మీన లగ్నం) – సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల వరకు.పెద్దశేష వాహనం – రాత్రి 9 నుండి 11 గంటల వరకు కొనసాగుతుంది.
అలాగే 19.09.2023 – మంగళవారం – చిన్నశేష వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు. స్వప్నతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు. హంస వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు. 20.09.2023 – బుధవారం – సింహ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు. ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు. 21.09.2023 – గురువారం – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు. సర్వభూపాల వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు. 22.09.2023 – శుక్రవారం – మోహినీ అవతారం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు. గరుడసేవ – రాత్రి 7 గంటలకు ప్రారంభం.
23.09.2023 – శనివారం – హనుమంత వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు. స్వర్ణరథం – సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు. గజ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు. 24.09.2023 – ఆదివారం – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు. స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు. చంద్రప్రభ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు. 25.09.2023 – సోమవారం – రథోత్సవం- ఉదయం 6.55 గంటలకు. అశ్వ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు. 26.09.2023 – మంగళవారం – పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 3 నుండి 6 గంటల వరకు. స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం – ఉదయం 6 నుండి 9 గంటల వరకు. ధ్వజావరోహణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతుందని ఆలయ నిర్వహకులు తెలిపారు.