జనగామలో వేడెక్కిన రాజకీయం.. అర్థనగ్నంగా ఎమ్మెల్యే నిరసన..!

-

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గంపై పల్ల రాజేశ్వర్ రెడ్డి అనుచరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు బీఆర్ఎస్ దళిత సంఘాలు. దళితులపై దాడి చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కి జ్ఞానోదయం కలగాలని జనగామ ఆర్టీసీ చౌరస్తా లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.


అనంతరం చొక్కా విప్పి అర్థనగ్నంగా నిరసన తెలియజేశారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉద్యమంలో ఎక్కడ ఉన్నారో తెలియదు అని.. దళిత నాయకుల మీద కేసులు పెట్టడం సరైంది కాదు అన్నారు. బీఆర్ఎస్ పార్టీని విచ్చిన్నం చేసే పల్లా రాజేశ్వర్ రెడ్డి కబర్దార్..బీబీ నగర్ లో 256 మంది ప్లాట్లను కబ్జా చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి కొడుకు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి దురాగతలాను క్షమించడు. సిఎం కేసిఆర్ పల్లా పై ఎక్వైంరీ చేయించాలని కోరారు. దళితులకు బీఆర్ఎస్ తరుపున  పక్షాన క్షమాపణ చెప్తున్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news