‘బాబర్ కాదు.. కోహ్లీనే నా ఫేవరెట్’ – పాక్ లేడీ ఫ్యాన్ వీడియో వైరల్

-

భారత క్రికెట్ లో రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ లోను అభిమానులు ఉన్నారు. ఆసియా కప్ లో భాగంగా భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన పాక్ యువతి కోహ్లీపై తన అభిమానాన్ని చాటారు.

virat-kohli-caught-on-camera-nose-picking-during-india-vs-pakistan-asia-cup-2023-match
virat-kohli-caught-on-camera-nose-picking-during-india-vs-pakistan-asia-cup-2023-match

‘విరాట్ కోసమే మ్యాచ్ కి వచ్చా. కోహ్లీ సెంచరీ చేయకపోవడంతో నిరాశ చెందా. నాకు రెండు జట్లు ఒకటే. బాబర్, కోహ్లీలలో ఫేవరెట్ ఎవరంటే కోహ్లీ అనే చెబుతా’ అని ఆ యువతి తెలిపారు. కాగా, ఆసియా కప్-2023లో పాకిస్తాన్ టీం సూపర్-4కు చేరింది. తొలి మ్యాచులో నేపాల్ పై విజయం, నిన్న మ్యాచ్ రద్దు కావడంతో మూడు పాయింట్లు సాధించింది. ఇక రేపు జరిగే భారత్-నేపాల్ మ్యాచులో గెలిచిన టీం సూపర్-4కు క్వాలిఫై అవుతుంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే భారత్ సూపర్-4 కు చేరుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news