ఆసియా కప్-2023లో పాకిస్తాన్ టీం సూపర్-4కు చేరింది. తొలి మ్యాచులో నేపాల్ పై విజయం, నిన్న మ్యాచ్ రద్దు కావడంతో మూడు పాయింట్లు సాధించింది. ఇక రేపు జరిగే భారత్-నేపాల్ మ్యాచులో గెలిచిన టీం సూపర్-4కు క్వాలిఫై అవుతుంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే భారత్ సూపర్-4 కు చేరుతుంది. కాగా… ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయింది.
దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇలా మ్యాచ్ రద్దు కావడం ఆసియా కప్ లో ఇది రెండవసారి. 1997లో శ్రీలంక వేదికగా ఇరుజట్ల మధ్య జరగగా… తొలుత పాక్ బ్యాటింగ్కు దిగింది. ఆ సమయంలో భారత బౌలర్ల దెబ్బకు పాకిస్తాన్ జట్టు 9 ఓవర్లు ఐదు వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేసింది.ఈ నేపథ్యంలోనే వర్షం పడటం తో మ్యాచ్ మరుసటి రోజుకు వాయిదా వేశారు. అప్పుడు కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు.