విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వం కృషి : సబితా ఇంద్రారెడ్డి

-

విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సనత్‌నగర్‌లో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, బన్సీలాల్ పేటలోని ప్రభుత్వ పాఠశాలలో 1.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..  వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేకల మండి పాఠశాలను హై స్కూల్‌గా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పేద విద్యార్థులు అధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో మన బస్తీ -మన బడి కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, వారానికి 3 రోజులు రాగి జావా అందిస్తున్నామని గుర్తు చేశారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news