తెలంగాణ ప్రభుత్వ గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ సమీపంలోని శాంతినగర్‌లో తెలంగాణ మటన్ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఈ క్యాంటీన్‌ను ఈ నెల 12న ప్రారంభించనున్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మటన్ బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాలను ఇక్కడ విక్రయిస్తారని సమాఖ్య సభ్యులు తెలిపారు.
ఇప్పటికే శాంతినగర్‌లో ప్రారంభమైన చేపల క్యాంటీన్‌కు మంచి ఆదరణ లభించడంతో మటన్ క్యాంటీన్‌పై గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య దృష్టి సారించింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు అనుమతించడంతో పనులు చేపట్టారు. సమాఖ్య కేంద్ర కార్యాలయం సమీపంలో క్యాంటీన్ నిర్మించారు. ముందుగా హైదరాబాద్‌లో దీన్ని ప్రారంభించి అన్నిజిల్లా కేంద్రాలకు విస్తరిస్తామని సమాఖ్య ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొర్రెల సంఖ్య పెద్దఎత్తున పెరిగిందని.. అయినా మటన్ ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.