కాలుష్యంలో నిత్యం తిరుగుతున్నారా..? ఈ మాస్కులు ధ‌రించండి..!

-

ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్యం ఎంత ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరిందో అంద‌రికీ తెలిసిందే. అయితే కేవ‌లం ఢిల్లీనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోనూ రోజు రోజుకీ కాలుష్యం పెరిగిపోతోంది.

ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్యం ఎంత ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరిందో అంద‌రికీ తెలిసిందే. అయితే కేవ‌లం ఢిల్లీనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లోనూ రోజు రోజుకీ కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో నిత్యం ఆ కాలుష్యాన్ని పీలుస్తున్న ప్ర‌జ‌లు అనేక అనారోగ్య స‌మ‌స్యల బారిన ప‌డుతున్నారు. చాలా మందికి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు, క్యాన్స‌ర్లు వ‌స్తున్నాయి. అయితే కేవ‌లం ఢిల్లీ వాసులే కాదు, నిజానికి కాలుష్యంలో నిత్యం తిరిగే ఎవ‌రైనా స‌రే.. దాన్నుంచి త‌ట్టుకునేందుకు సేఫ్టీ మాస్కులు ధ‌రించాలి. మ‌రి మ‌న‌కు ప్ర‌స్తుతం ఎన్ని ర‌కాల మాస్కులు అందుబాటులో ఉన్నాయో, అవి ఎలా ప‌నిచేస్తాయో, వాటి ధ‌ర ఎంత ఉంటుందో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

best anti pollution masks for everyone

ఎన్‌95 మాస్కులు

ఇవి యాంటీ పొల్యూష‌న్ మాస్కులు. గాలిలో ఉండే 95 శాతం వ‌ర‌కు కాలుష్య కార‌కాల‌ను అడ్డుకుంటాయి. ముక్కు ద్వారా మ‌నం పీల్చే గాలిలో ఉండే కాలుష్య కార‌కాల‌ను ఫిల్ట‌ర్ చేసి మ‌న‌కు స్వ‌చ్ఛ‌మైన గాలిని అంద‌జేస్తాయి. ఈ మాస్కుల ధ‌ర ఒక్కొక్క‌టి దాదాపుగా రూ.90 నుంచి రూ.150 వ‌ర‌కు ఉంటుంది. ఒక్క మాస్కును 2 నుంచి 3 రోజుల వ‌ర‌కు వాడ‌వ‌చ్చు.

ఎన్‌99, ఎన్‌100 మాస్కులు

గాలిలో ఉండే 99 శాతం కాలుష్య కార‌కాల‌ను ఈ మాస్కులు ఫిల్ట‌ర్ చేస్తాయి. అయితే వీటి ఖ‌రీదు ఎక్కువ‌గా ఉంటుంది. రూ.1800 మొద‌లుకొని రూ.2800 వ‌ర‌కు ఒక్కో మాస్కు ఖ‌రీదు ఉంటుంది. అయితే ఒక్క మాస్కును 5 నుంచి 6 నెల‌ల పాటు ఉప‌యోగించుకోవ‌చ్చు.

పీ95, ఆర్‌95 మాస్కులు

ప‌రిశ్ర‌మ‌ల నుంచి వెలువడే హానికార‌క కాలుష్య ఉద్గారాల బారి నుంచి త‌ప్పించుకోవాలంటే ఈ మాస్కులు వాడాలి. ఇవి ఎంతటి హానిక‌ర‌మైన కాలుష్య కార‌కాల‌నైనా స‌రే ఫిల్ట‌ర్ చేస్తాయి. మ‌న‌కు స్వ‌చ్ఛ‌మైన గాలినిస్తాయి. అయితే ఒక్క మాస్కు కేవ‌లం 8 గంటల పాటు మాత్ర‌మే ప‌నిచేస్తుంది. ఈ మాస్కుల 10 ప్యాక్ ధర రూ.10,900 ఉంటుంది. అంటే ఒక్క మాస్కుకు రూ.1090 అవుతుంద‌న్న‌మాట‌.

టోటోబోబో మాస్కులు

హానికార‌క కాలుష్య ఉద్గారాల‌ను ఫిల్ట‌ర్ చేయ‌డంలో ఈ మాస్కులు కూడా బాగానే ప‌నిచేస్తాయి. ఒక్కో మాస్కు ధ‌ర రూ.2వేల నుంచి రూ.2500 వ‌ర‌కు ఉంటుంది. వీటిని మ‌ళ్లీ మ‌ళ్లీ ఉప‌యోగించుకోవ‌చ్చు.

ఎన్‌95 ఆరా పార్టిక్యులేట్ రెస్పిరేట‌ర్

కాలుష్యంలో నిత్యం తిరిగే వారికి ఈ మాస్కులు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఒక్కో మాస్కు ధ‌ర రూ.150 నుంచి రూ.200 వ‌ర‌కు ఉంటుంది. ఒక్క మాస్కును 4 నుంచి 5 రోజుల వ‌ర‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు.

రెస్ప్రో మాస్క్

పీఎం 10 స్థాయి కాలుష్య కార‌కాల‌ను కూడా ఈ మాస్క్ ఫిల్ట‌ర్ చేయ‌గ‌ల‌దు. వీటి ధ‌ర రూ.750 నుంచి రూ.1వేయి వ‌ర‌కు ఉంటుంది. వీటిని 69 గంట‌ల పాటు మాత్ర‌మే ఉప‌యోగించుకోగ‌లం.

Read more RELATED
Recommended to you

Latest news