రోహిత్ శర్మ కెప్టెన్ గా 15 మందితో జట్టును ప్రకటించింది బీసీసీఐ. వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్, కే.ఎల్.రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ ఎంపికయ్యారు. క్యాండీలో విలేకర్ల సమావేశంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ జట్టు పేర్లను ప్రకటించారు.
టీమిండియా కీలక ఆటగాడు, ఓపెనర్ కే.ఎల్.రాహుల్ తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. ఆసియా కప్ 2023లో భారత్-పాక్ మధ్య క్యాండీలో జరిగిన మ్యాచ్ తరవాత కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ లను కలిసిన తరువాత అజిత్ అగార్కర్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. 2023 ఆసియా కప్ కోసం ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న సంజుశాంసన్, తిలక్ వర్మ, ప్రసిద్ కృష్ణ భారత ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక కాకపోవడం గమనార్హం.