ఆ ఎమ్మెల్యేలకు జగన్ హ్యాండ్ ఇచ్చినట్లేనా??

-

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారో అంచనా వేసి వారి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలోని 34 ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థులు దాదాపుగా ఖరారు చేసినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయోగాలకు తావు లేకుండా కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల పేర్లను మాత్రమే జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. 34 నియోజకవర్గాలలో 6 లేదా 7 నియోజకవర్గాల్లో మాత్రమే అభ్యర్థుల మార్పు ఉంటుందని మిగిలిన చోట్ల సెట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లకి టికెట్టు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాంధ్రలోని ఎమ్మెల్యేలను మార్చే ఛాన్స్ ఉన్న నియోజకవర్గాలు ఏవంటే ఆముదాలవలస, రాజాం, పాతపట్నం, బొబ్బిలి, ఎచ్చెర్ల, టెక్కలి, విశాఖ తూర్పు ఈ నియోజకవర్గాల నుంచి సిట్టింగ్, పాత అభ్యర్థుల స్థానంలో కొత్త అభ్యర్థులను బరిలో దించనున్నారు అని సమాచారం.

ఆముదాలవలసలో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న తమ్మినేని సీతారాం స్థానంలో గాంధీ ని నిలబెట్టాలని అనుకుంటున్నాట్లు తెలుస్తోంది. ఇక తమ్మినేనికి గాని, ఆయన తనయుడుకు గాని శ్రీకాకుళం పార్లమెంట్ సీటు ఇస్తారని టాక్. అటు రాజాం నియోజకవర్గంలో కంబాల జోగులు స్థానంలో తలే భద్రయ్య కుమారుడు డాక్టర్ తలే రాజేష్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్లేస్ లో వరప్రసాద్ నిలబెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బొబ్బిలి సీటులో అప్పలనాయుడు స్థానంలో  శ్రీనివాస్ రావు ను నిలబెట్టాలని అనుకుంటున్నారు. ఎచ్చెర్ల సిట్టింగ్ గొర్లే కిరణ్ కుమార్ స్థానంలో చిన్న శీనును నిలబెడతారని అనుకుంటున్నారు.

అభ్యర్థుల మార్పు ఎందుకంటే సర్వేలలో పనితీరు సరిగా లేకపోవడం, ఈ ఎమ్మెల్యేలకు ప్రజలలో ఉన్న వ్యతిరేకత, సొంత నియోజకవర్గంలో సరైన క్యాడర్ లేకపోవడం  ఇవన్నీ కలిపి ఆ ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికలను దూరం చేస్తాయేమోనని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news