త్వరపడకపోతే రామప్పకు యునెస్కో గుర్తింపు లేనట్టే..!

-

అత్యంత అద్భుతమైన శిల్పకళకు చిరునామా అయిన రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు లభించింది. ఈ హోదాతో రామప్ప ఖ్యాతి జగద్విఖ్యాతమైంది. ఈ గుర్తింపు ఒక్కరోజులోనో ఒక్కరి వల్లనో వచ్చింది కాదు. అయితే ఈ గుర్తింపు రావడానికి చేసిన కృషి, పడిన శ్రమ.. హోదాను కాపాడుకోవడంలో కనిపించట్లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. యునెస్కో అడిగిన నివేదికలను పంపించే గడవు దగ్గరకొస్తున్నా ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడకపోవడమే దీనికి కారణం.

యునెస్కో గుర్తింపు దక్కిన తర్వాత యునెస్కో విధించిన షరతుల ప్రకారం కట్టడాల సంరక్షణ, పర్యాటకుల సౌకర్యాలు, సరిహద్దులు, తదితర అంశాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. రుద్రేశ్వర ఆలయం, ఇతర ఉపాలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ పాలంపేట స్పెషల్ ఏరియా డెవలప్​మెంట్​ అథారిటీ నిర్వహించాల్సిన పాత్ర, బాధ్యతలు బఫర్ జోన్ హద్దులు తదితర సమగ్ర సమాచారాన్ని నివేదికల రూపంలో యనెస్కోకు ఇవ్వాలి.

ఈ నివేదికలను వరల్డ్ హెరిటేజ్ కమిటీకి 2024 ఫిబ్రవరి 1కల్లా అప్పగించాలి. దానికంటే కనీసం రెండు నెలల ముందే కేంద్రానికి నివేదికలు అందించాల్సి ఉంటుంది. యునెస్కో గుర్తింపును నిలబెట్టుకోవాలంటే ఇవన్నీ త్వరితగతిన చేపట్టాలి. కానీ అలాంటి కార్యాచరణ ఏదీ కనిపించట్లేదు. ఇలా అయితే గడువు పూర్తయ్యాక ఇచ్చినా ఫలితం ఉండదని నిపుణులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news