చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఐటీ నోటీసులపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకు పాల వ్యాపారం అని పేర్కొన్నారు. పాల వ్యాపారం చేస్తే పదివేల కోట్ల రూపాయలు వస్తాయా అని ప్రశ్నించారు. 20 సంవత్సరాల నుంచి వాళ్ల ఫ్యామిలీ మొత్తం మోసం చేసే పనిలో ఉందన్నారు.
చట్టాలు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని దోచుకునే వ్యక్తి చంద్రబాబు అన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను 5వేల కోట్లు ఖర్చు చేస్తానని పార్టీ నేతలకు చెప్పాడు. అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు కొడాలి నాని. మనం చేసిన మంచి పనులను ప్రజలు చెప్పాలని.. చంద్రబాబులా సెల్ఫీలు తీసుకొని చెప్పుకోవడమెంటో అంటూ చమత్కరించారు. హైదరాబాద్ కట్టాననే చంద్రబాబుకు అక్కడ డిపాజిట్ రాదని.. పిట్టలదొర లేని లోటుని ఆయన తీరుస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.