రైతులకు ఉచిత విద్యుత్ పై మంత్రి హరీశ్ రావు, మంత్రి కేటీఆర్ లకు సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 24 గంటలు కాదు.. 20 గంటలు ఇచ్చినట్టు రుజువు చేసినా తన పదవీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 15 గంటల కరెంట్ ఇచ్చినట్టు నిరూపించినా కూడా తన ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు ఎంపీ కోమటిరెడ్డి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే.. దళిత బంధు, బీసీ బంధు అని తెరపైకి తెచ్చారని.. బంద్ పథకాలన్నీ కేసీఆర్ దుకాణం బంద్ చేయడానికే అని సెటైర్ వేశారు. హోంగార్డు రవీందర్ ది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్య అని ఆరోపించారు కోమటిరెడ్డి. సెప్టెంబర్ 17న బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కర్నాటకలో ఇచ్చే 5 కొత్త పథకాలు కాంగ్రెస్ నేత సోనియా గాందీ చేత చెప్పిస్తామన్నారు. 400 కోట్ల ప్రజలు బాగుపడుతారని తెలంగాణ ఇస్తే.. కేవలం 4 కుటుంబాలు మాత్రమే బాగుపడుతున్నాయన్నారు.