పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్ సృష్టిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాకి మరో నాలుగు ఏనుగులు గుంపు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా కురుపాం మండలం జరడ గ్రామంలో సంచరిస్తుంది మరో ఏనుగుల గుంపు. భయాందోళనకు గురవుతున్నారు కొమరాడ మండలం గుణానపురం ప్రజలు.. ఏనుగురు పంట పోలాలను నాశనం చేయబోతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది ఏనుగులతోనే ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇక మరో నాలుగు తొోడు అవ్వడంతో
నాగావళి పరివాహక ప్రాంతం లో 12కి చేరిన ఏనుగులు.
ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేసి ఏనుగులను తరలించాలి అని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్థులు. ఇటీవలే జిల్లాలోని రోడ్డుపై ఓ ఏనుగు సంచరించి హల్ చల్ చేయడంతో పాటు బస్సు అద్దాలను ధ్వంసం చేసి.. స్థానికులను భయబ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఏనుగు భీభత్సం సృష్టించి ఇద్దరి ప్రాణాలను బలికొన్న విషయం తెలిసిందే. దీంతో మన్యం జిల్లా ప్రజలు కాస్త భయాందోళనలో ఉన్నారు.