షట్‌డౌన్‌ చేయకుండా ల్యాప్‌టాప్‌ క్లోజ్‌ చేస్తున్నారా..? అయితే ఈ వీడియో చూడండి

-

ల్యాప్‌టాప్‌తో వర్క్‌ చేసేవాళ్లకు.. వర్క్‌ అవగానే..దాన్ని పక్కనపడేసి వాళ్ల సొంతపనులు చూసుకోవడం అలవాటు. కనీసం అది షట్‌డౌన్‌ కూడా చేయకుండా అలానే మూసేస్తారు. మీరు ఇదే కేటగిరీలో ఉండి ఉంటారు. జాగ్రత్తగా అప్పటి వరకూ ఓపెన్ చేసిన ట్యాబ్స్‌ అన్నీ క్లోజ్‌ చేసి, షట్‌డౌన్‌ క్లిక్‌ చేసి అది షట్‌డౌన్‌ అయిపోయాక స్క్రీన్‌ బ్లాంక్‌ అయిపోయాక అప్పుడు క్లోజ్‌ చేయాలి. కానీ ఎవరికీ ఇంత ఓపిక ఉండదు. పని అవగానే పక్కనపడేస్తారు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూడండి. దెబ్బకి షాక్‌ అవుతారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఏం ఉందంటే..

వైరల్ వీడియోలో టేబుల్‌పై ఒక ల్యాప్‌టాప్ మూసివేసి ఉంది. ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌లో ఉంది. అయితే సడెన్‌గా ల్యాప్‌టాప్ నుంచి పొగలు వచ్చాయి. ల్యాప్‌టాప్‌ నుంచి పొగలు రావడంతో ఓ వ్యక్తి ఆపేందుకు ప్రయత్నించాడు. దాన్ని ఓపెన్‌ చేద్దాం అనుకుని పైకి లేపాబోయాడు..అంతే పొగలు మరింత ఎక్కువయ్యాయి. క్షణాల్లోనే ల్యాప్‌టాప్‌లో నుంచి మంటలు రావడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత ల్యాప్‌టాప్‌ని తీసుకుని బయటకు విసిరేశాడు. ఈ పేలుడుకు కారణాన్ని వీడియో క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Brandweer Hollum (@brandweerhollum)

ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు తరచుగా బ్యాటరీపై శ్రద్ధ చూపరని లిథియం బ్యాటరీ ఓవర్‌లోడ్ అయినప్పుడు, ద్రవం దాని నుండి విడుదలవుతుందని ఈ సమయంలో ఏదైనా విద్యుత్ షాక్‌కు గురైతే బ్యాటరీ పేలిపోతుందని వీడియో క్యాప్షన్‌లో తెలిపారు. దీని కారణంగా ఎల్లప్పుడూ నాణ్యమైన ల్యాప్‌టాప్ బ్యాటరీలు, ఛార్జర్‌లను ఉపయోగించమని సూచించాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 52k పైగా లైక్స్‌ వచ్చాయి. 4k పైగా కమెంట్స్‌ వచ్చాయి.

మీరు ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసేప్పుడు కేవలం స్టోరేజ్‌, ప్రాసెసర్‌తో పాటు బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. అలాగే ఎలక్ట్రానిక్‌ వస్తువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఒక్కసారి రిపేర్‌కు వచ్చాయంటే.. ఇక షెడ్డుకే. కాబట్టి డబ్బులు ఎక్కువైనా సరే మంచివే కొనుగోలు చేయాలి. అంతేకాదు.. షట్‌డౌన్‌ చేయకుండా క్లోజ్‌ చేయడం, ల్యాప్‌టాప్‌ను వాడేప్పుడు ఛార్జింగ్‌ పెట్టడం లాంటివి అస్సలు చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news