ఎల్‌ఐసీ పాలసీని తీసుకొని కొన్నేళ్లు కట్టి ఆపేశారా..? డబ్బు ఎంత వస్తుందో తెలుసా..?

-

చాలా మంది డబ్బులు సేవ్‌ చేయాలి భవిష్యత్తులో వచ్చే ఖర్చులకు ఇప్పటి నుంచి పొదుపు చేయాలని ఏదో ఒక స్కీమ్‌లో జాయిన్‌ అవుతారు. కానీ జాయిన్‌ అయ్యేప్పుడు ఉన్న మూడు, ఉత్సాహం కొన్నాళ్లకు ఉండదు వాటికి అలా ఆపేస్తారు. పోతేపోనీలో ఏం చేస్తాం అని లైట్‌ తీసుకుంటారు. మీరు కూడా ఎల్‌ఐసీ పాలసీ చేసి, కొన్ని కారణాల వల్ల సరెండర్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా నియమాలు, నిబంధనలను తెలుసుకోండి.

ఎల్‌ఐసీ పాలసీని మధ్యలోనే నిలిపివేయడాన్ని పాలసీని సరెండర్ చేయడం అంటారు. మీరు కనీసం 3 సంవత్సరాల తర్వాత మాత్రమే LIC పాలసీని సరెండర్ చేయవచ్చు. మీరు 3 సంవత్సరాల ముందు చేస్తే, మీకు డబ్బు రాదు. పాలసీని సరెండర్ చేసినప్పుడు, మీరు LIC నియమాల ఆధారంగా సరెండర్ విలువను పొందుతారు. అంటే మీరు పాలసీని నిలిపివేయాలని లేదా ఎల్‌ఐసి నుంచి డబ్బును విత్‌డ్రా చేయాలని నిర్ణయించుకుంటే, దాని విలువకు సమానంగా మీరు తిరిగి పొందే డబ్బును సరెండర్ వాల్యూ అంటారు. మీరు మొత్తం మూడేళ్లపాటు ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించినట్లయితే, మీరు మాత్రమే సరెండర్ విలువను పొందగలరు.

అటువంటి పరిస్థితిలో పాలసీని సరెండర్ చేయడం ద్వారా కస్టమర్లు చాలా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. మెచ్యూరిటీకి ముందే ఎల్ఐసీ పాలసీని సరెండర్ చేయడం వల్ల దాని విలువ తగ్గుతుంది. మరోవైపు, మీరు రెగ్యులర్ పాలసీని తీసుకొని, దానిని సరెండర్ చేయాలనుకుంటే, మీ విలువ 3 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించిన తర్వాత మాత్రమే లెక్కించబడుతుంది. కానీ మీరు మూడేళ్లలోపు పాలసీని సరెండర్ చేస్తే, అప్పుడు ఎటువంటి విలువ ఇవ్వబడదు.

మీరు 3 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే…అప్పుడు మీరు సరెండర్ విలువకు అర్హులు అవుతారు.. ఆ తర్వాత మీరు చెల్లించిన ప్రీమియంలో 30% మాత్రమే పొందుతారు కానీ మొదటి సంవత్సరం ప్రీమియం మినహాయించి. అంటే మీరు మొదటి సంవత్సరంలో చెల్లించిన ప్రీమియం డబ్బు కూడా సున్నా అవుతుంది.

డిపాజిట్ పాలసీని సరెండర్ చేయడానికి, LIC సరెండర్ ఫారమ్ నంబర్ 5074 మరియు NEFT ఫారమ్ అవసరం. ఈ ఫారమ్‌లతో పాటు, మీరు మీ పాన్ కార్డ్ కాపీని పాలసీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్‌లను జతచేయాలి. మీరు పాలసీని ఎందుకు వదిలేస్తున్నారో తెలుపుతూ చేతితో వ్రాసిన లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రూల్స్‌ పాటిస్తే.. మీరు కట్టిన అమౌంట్‌లో కొంతైనా వస్తుంది. అలా కాకుండా.. మూడేళ్లపాటు ప్రీమియం చెల్లించి అలా ఏం చేయకుండా వదిలేస్తే.. మీరు కట్టిన ప్రీమియం అంతా వేస్ట్‌ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news