జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి – కేటీఆర్

-

సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. పార్టీ శ్రేణులు ఈ వేడుకలలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారత సమైక్యాలో తెలంగాణ విలీనమైన రోజును రాష్ట్ర ప్రజలంతా జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటున్నారని అన్నారు.

ఆ రోజున హైదరాబాదులో జరిగే వేడుకలలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించే సంబరాలకు మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేస్తారని తెలిపారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా జరుపుకునే జాతీయ సమైక్యత దినోత్సవం పై కొన్ని పార్టీలు రాజకీయాలు చేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

ప్రతి అంశానికి మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టే విచ్చిన్నకరమైన శక్తుల కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలన్నారు. చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తెలంగాణ జీవనాడిని కలుషితం చేయాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news