ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..396 పోస్టులు.. వయోపరిమితి పెంపు

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని భవిత కేంద్రాల్లో 396 ఎడ్యుకేషనల్ రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది. అభ్యర్థుల వయోపరిమితిని 18-54 ఏళ్ల వరకు పెంచింది. అదేవిధంగా విద్యా అర్హతలకు వెయిటేజీ మార్కులను నిర్ణయించింది. టెన్త్ కు 20, ఇంటర్ కు 25, స్పెషల్ డిప్లమా కోర్సులకు 35, సర్వీస్ కు 5 మార్కులు కేటాయించింది. ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు.

CM Jagan's visit to Nandyala and Kurnool districts on 19th of this month
CM Jagan’s visit to Nandyala and Kurnool districts on 19th of this month

ఇది ఇలా ఉండగా, ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ నెల 19న సీఎం జగన్‌ నంద్యాల, కర్నూలు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కృష్ణగిరి మండలం లక్కసాగరంలో హంద్రీనీవా నీటితో 74 చెరువులు నింపే పంప్ హౌస్ ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అనంతరం డోన్‌లో బహిరంగసభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించే ఛాన్స్ ఉంది. అటు రేపు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news