ఈ రోజు సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న వన్ డే లో టాస్ ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కు వచ్చింది. నిర్ణీత ఓవర్ లలో ఆస్ట్రేలియా కేవలం అయిదు వికెట్ల నష్టానికి 416 పరుగులు చేసి ఔరా అనిపించింది. వాస్తవానికి సౌత్ ఆఫ్రికా కు దక్కిన స్టార్టింగ్ కు అంతమాత్రం స్కోర్ చేయడం చాలా కష్టం అని చెప్పాలి. కానీ డేంజరస్ ప్లేయర్ హేన్రిచ్ క్లాజెన్ అద్భుతమైన విద్వాంసానికి ఆస్ట్రేలియా బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. థర్డ్ డౌన్ లో క్రీజులోకి వచ్చిన క్లాజెన్ మొదటి కొన్ని అబంతులను వృధా చేసినా ఆ తర్వాత అన్నిటికీ కలిపి వడ్డీ ఇచ్చేశాడు. ఇతను ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి కేవలం 83 బంతుల్లోనే 174 పరుగులు చేశాడు. ఈ ఫిగర్స్ చూస్తేనే వినాశనం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో అర్ధం అవుతోంది.. చివరి బంతి వరకు తన విద్వసాన్ని సృష్టించిన క్లాజెన్ ఆఖరి బంతికి స్థాయినిస్ కు అవుట్ అయ్యాడు. ఇతని ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు మరియు 13 సిక్సులు ఉన్నాయి.
గత మ్యాచ్ లో మార్కురామ్ సెంచరీ చేసి ఆస్ట్రేలియాను ఓడించగా , ఈ మ్యాచ్ లో క్లాజెన్ సెంచరీ చేశాడు.. మరి ఈ టార్గెట్ కు ఆస్ట్రేలియా నుండి ఏమైనా సమాధానం ఉంటుందా అన్నది తెలియాలంటే ఛేజింగ్ వరకు ఆగాల్సిందే.