ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా ఛేదనలో ఉంది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్ లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ కు ఆ మాత్రం స్కోర్ తీసుకురావడంలో షకిబుల్ హాసన్ 80, హృదయ్ 54 మరియు నసూమ్ అహ్మద్ 40 లు పోరాడి సాధించారు. ఆ తర్వాత 266 పరుగుల లక్ష్యంతో ఛేదనను స్టార్ట్ చేసిన ఇండియాకు ఆరంభంలోనే రెండు బలమైన షాక్ లు తగిలాయి. కెరీర్ లోనే తొలి మ్యాచ్ ఆడుతున్న తంజీమ్ హాసన్ షకీబ్ రోహిత్ శర్మ ను ఇన్నింగ్స్ రెండవ బంతికే బౌల్డ్ చేసి బంగ్లాకు సూపర్ స్టార్ట్ ను అందించాడు. ఆ తర్వాత వెంటనే యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మ ను కూడా అవుట్ చేసి డబుల్ షాక్ అందించాడు తాంజిం షకీబ్ హాసన్. ప్రస్తుతం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి ఆడుతోంది..
క్రీజులో రాహుల్ మరియు గిల్ లు నెమ్మదిగా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలంటే ఇంకా శ్రమించాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఏమి జరగనుందో.