తెలంగాణలో అధికారంలోకి రావడం, తదనంతరం ఏపి లో బలపడడం ఖాయం అన్నారు సిడబ్ల్యుసి సభ్యుడు రఘువీరారెడ్డి. ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన కాంగ్రెస్ కు సీట్ల త్యాగాలు పెద్ద లెక్కేముంది. దేశం ముఖ్యం…..”ఇండియా” కూటమి లక్ష్యం అదే అన్నారు. నాలుగేళ్ల శలవు తర్వాత, నేను ఏమీ అడగకుండానే పార్టీ అధినాయకత్వం గురుతర బాధ్యతలు ఇచ్చిందని… తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతి గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారని వెల్లడించారు.
అందుకే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సిడబ్ల్యుసి సమావేశాలు నిర్వహిస్తోందని.. కర్నాటక లో ఘన విజయంతో కాంగ్రెస్ పూర్వ వైభవం పునఃప్రారంభంమైందని చెప్పారు. తర్వాత తెలంగాణ లో అధికారంలోకి రావడం, తదనంతరం ఏపి లో బలపడడం ఖాయం అని చెప్పుకొచ్చారు. దేశం పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే విశ్వాసం నాకుందని.. కాంగ్రెస్ పార్టీ తో సహా, “ఇండియా” భాగస్వామ్య పక్షాలు సమిష్టిగా లోకసభ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకోవడం ఖాయం అని పేర్కొన్నారు. “ఇండియా” కూటమి ఐక్యతను చూసి, పోటీగా ఎన్.డి.ఏ కూటమి సమావేశాన్ని బిజేపి నిర్వహించిందని వెల్లడించారు రఘువీరారెడ్డి.