పార్లమెంటులో మోదీ కనుసైగతో బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు పలుకుతున్నాయి : రాహుల్‌ గాంధీ

-

తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతో పోరాటం చేస్తున్నామని రాహుల్‌గాంధీ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పైకి విడిగా కనిపిస్తున్నా.. అంతా ఒక్కటేనని.. పార్లమెంటులో అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. పార్లమెంటులో బీజేపీ ఏం చెబితే దానికి బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతిస్తాయని.. మోదీ కనుసైగ చేయగానే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విజయభేరి సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.

‘కాంగ్రెస్‌ సభకు ఆటంకం కలిగించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం యత్నించాయి. కాంగ్రెస్‌ సభ విజయవంతం కావొద్దని బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ఇవాళే సభలు పెట్టుకున్నాయి. దేశంలో ప్రశ్నించిన వారిపై మోదీ సర్కారు ఎన్నో కేసులు పెట్టింది. తెలంగాణలో కేసీఆర్‌, ఓవైసీపై మోదీ సర్కార్‌ ఎలాంటి కేసులు పెట్టలేదు. తెలంగాణ సర్కార్‌ ఎంతో అవినీతిలో కూరుకుపోయింది. భారాస ఎంత అవినీతి చేసినా ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. ధరణి పోర్టల్‌ పేరిట పేదల భూములను ప్రభుత్వం లాక్కొంది. రైతుబంధు పేరిట భూస్వాములకు భారీగా ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయటం లేదు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన ఉన్నట్లే దేశంలో మోదీ పాలన ఉంది.’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news