పాత పార్లమెంట్ భవనం కొలువుదీరింది. కొత్త పార్లమెంట్ భవనంలో ఇవాళ మధ్యాహ్నం సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి ప్రసంగం చేశారు. గత చేదు అనుభవాలను మరిచిపోవాలన్నారు. భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేవిధంగా ఉండాలన్నారు. ఆటల నుంచి అంతర్జాయం వరకు మహిళలు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. మహిళా కోటా చాలా కాలంగా పెండింగ్ లో ఉందని తెలిపారు.
భవనం మారింది.. భావనలు కూడా మారాలి అన్నారు ప్రధాని మోడీ. మహిళా సాధిరికతపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదన్నారు. ఆజాదీ అకాలంలో ఇది ఉషోదయ కాలం అన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే మా లక్ష్యం. భవిష్యత్ తరాలకు స్పూర్తిని ఇచ్చేవిధంగా పని చేయాలన్నారు ప్రధాని మోడీ. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు వచ్చింది. మహిళలకు రిజర్వేషన్ కల్పించే భాగ్యం భగవంతుడు నాకు కల్పించాడని పేర్కొన్నారు ప్రధాని మోడీ. నారీ శక్తి బిల్లును చట్టం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. మహిళా బిల్లుకు ప్రధాని నారీ శక్తి బిల్లు అని పేరు పెట్టడం విశేషం.