అటు ఏసీబీ..ఇటు హైకోర్టు..బాబు కేసుపై ఉత్కంఠ.!

-

ఏపీ రాజకీయాలు చంద్రబాబు అరెస్ట్ చుట్టూనే తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆయనని ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుండగా, అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్, రిమాండ్ పిటిషన్‌లపై విచారణలు జరుగుతున్నాయి. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది.

చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు లాయర్లు తరఫున సిద్ధార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు సాగుతున్నాయి.

ఇక క్వాష్ పిటిషన్‌పై విచారణలో చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ అనుమతి తీసుకోలేదని, ప్రజాప్రతినిధుల అరెస్టుపై గత తీర్పులు అనేకం ఉన్నాయని, 2020లో నమోదైన ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారు..? అని హరీష్ ప్రశ్నించారు. అరెస్ట్ చేసే సమయానికి చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ లేదు.. అది నమోదయ్యాకే అరెస్ట్ చేయాలన్న విషయాన్ని సాల్వే చెప్పుకొచ్చారు.

harish salve

విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన 3 పిటిషన్లు విచారణకు వచ్చాయి. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై టీడీపీ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.

చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్, బెయిల్ పిటిషన్లపై సీఐడీ ఇంతవరకూ ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదు. ఇలా అటు ఏసీబీ, ఇటు హైకోర్టులో బాబు కేసుకు సంబంధించిన అంశాలపై వాదోపవాదనలు జరుగుతున్నాయి. మరి ఇన్ని పిటిషన్లలో ఏది త్వరగా తేలుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news