ప్రపంచంలోనే అత్యంత హ్యాపీనెస్‌ దేశంగా ఆరోసారి నిలిచిన ఫిన్లాండ్‌.. ఏముందక్కడ..?

-

ఐక్యరాజ్య సమితి వరల్డ్‌ హ్యాపీనెస్‌ దేశాల జాబితాను విడుదల చేసింది. మళ్లీ అందులో ఆరోసారి కూడా ఫిన్లాండ్‌ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో డెన్మార్క్‌, మూడో స్థానంలో ఐస్‌లాండ్‌ ఉన్నాయి. ఫిన్లాండ్ పౌరులు ఇతర దేశాల ప్రజల కంటే ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు? వారి దగ్గర డబ్బు ఎక్కువగా ఉందా..? లైఫ్‌స్టైల్‌ బాగుందా..? ఒక్కసారి కాదు.. ఆరుసార్లు ఈ దేశమే మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ప్రశ్నకు ఫిన్లాండ్‌కు చెందిన వాళ్లే సమాధానం ఇచ్చారు. నిజంగా వాళ్లు చెప్పిన సమాధానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

యూరప్ దేశమైన ఫిన్లాండ్‌లో అనేక ప్రత్యేక విషయాలు ఉన్నాయి, దాని కారణంగా ఇది అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో మనీ ఎక్కువ సంపాదించేవాళ్ళకీ, తక్కువ సంపాదించే వాళ్ళకీ.. ఆనందం విషయంలో పెద్దగా తేడా లేదట. ఇక్కడి ప్రజలకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది, అవినీతి తక్కువ. ప్రజలు ఒకరికొకరు చాలా సహాయం చేసుకుంటారు. మంచి ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ ఉంది. ప్రజా రవాణా చాలా నమ్మదగినది, చౌకైనది. కూడా.

ఫిన్లాండ్ ప్రజలు ఒకే సూత్రంపై జీవిస్తారట. ఎవరి అంచనాల కోసమో కాకుండా మీ కోసం జీవించండి అనేది వారి రూల్‌. ఫిన్లాండ్ ప్రజలు తక్కువ ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే వారికి పెద్దగా ఏమీ అవసరం అవ్వట్లేదు. వారికి అవసరమైన ప్రతిదానికీ సులభంగా యాక్సెస్ ఉంటుంది. ఫిన్లాండ్ ప్రజలను విభిన్నంగా చేసే మరో విషయం ఏమిటంటే, ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. వారు ఎప్పుడూ సహాయం చేయడానికి ఒక అవకాశం కోసం చూస్తుంటారు. ఇది వారిని ఉత్తేజపరుస్తుందని వారు నమ్ముతారు. అందుకే ఆనందంగా ఉంటారట. దేనిలో నిపుణుడైతే, సమాజంలోని ఇతర వ్యక్తులతో మీ జ్ఞానాన్ని పంచుకుంటారట.

ఫిన్లాండ్‌లో ఒక సిద్ధాంతం బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడి విద్యార్థులు ప్రతిరోజూ ముగ్గురికి సహాయం చేస్తారు. పోస్ట్‌మ్యాన్‌కు ఒక గ్లాసు నీరు ఇవ్వడం, మధ్యాహ్నం తాతామామ్మలతో గడపడం లేదా పర్యాటకులు తమ దారిని కనుగొనడంలో సహాయం చేయడం వంటివి చేస్తారు. ఇది వారికి అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. వారి మనోబలం పెరుగుతుంది. మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపినట్లయితే, మీరు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.

కలిసుంటే కలదు సుఖం..

టాల్‌కూట్ (Talkoot) అనే పదం ఫిన్‌లాండ్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. దీని అర్థం.. ఒంటరిగా ఎవరూ చేయలేని పనిని కలిసి చేయడం. పొలాల్లో కలిసి పనిచేయడం ఫిన్లాండ్ ప్రజలకు ఇష్టం. షాపింగ్ మాళ్లలో కలిసి గడుపుతారు. ఇరుగుపొరుగు వారందరూ స్వచ్ఛందంగా సమావేశమవుతారు. వారు సహాయంతో గొప్ప పనులు చేస్తారు. కలిసి ఆహారాన్ని వండుతారు. కలిసి కూర్చుని తింటారు. ఇది ఒక సంప్రదాయం లాంటిది. ప్రజలు మంచి పొరుగువారిలా కలిసి జీవించడానికి ఇష్టపడతారు.

ఇక్కడి ప్రజలకు కుళ్లు, జలస్‌, లాంటి చాలా తక్కువగా ఉంటాయి. మనుషులను మనుషుల్లానే చూస్తారు. కులం, మతం, రాజకీయం వంటి తేడాలను గీతలు పెట్టుకోని మనస్తత్వం వాళ్లది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news