ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ గా ఉన్నవిషయం తెలిసిందే. దాదాపు 11 రోజుల నుంచి జైలులోనే ఉన్నారు చంద్రబాబు. కేవలం స్కిల్ డెవలప్ మెంట్ కేసులోనే కాదు. చంద్రబాబు పై పలు కేసులున్నాయి.
తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కేటాయించాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు బెయిల్ పిటీషన్ ను ఈ నెల 21కి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున న్యాయవాది హరీష్ సాల్వే వాధనలు వినిపించారు. గవర్నర్ అమోదం తెలుపకుండా చంద్రబాబును ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు పై గవర్నర్ అంగికారం లేదని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎలా అరెస్టు చేస్తారని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రశ్నించారు. 2020లోనే ఎఫ్ఐఆర్ నమోదైనట్టు సీఐడీ తరపు న్యాయవాది తెలిపారు. వాదోపవాదనలు విన్న హైకోర్టు ముందస్తు బెయిల్ విటీషన్ విచారణను 21కి వాయిదా వేసింది.