స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి సీఐడీ చీఫ్ సంజయ్ వ్యవహారశైలిని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తప్పుబట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుకే అక్రమమంటున్న సీఐడీ చీఫ్ సంజయ్… నీలం సహానీ ఇచ్చిన జీవోలు 47, 48, గవర్న్ మెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కార్పొరేషన్ సర్టిఫికెట్ పై ఏం సమాధానం చెబుతాడు? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో రెండు జీవోలు స్వయంగా ఇచ్చి, కీలక భూమిక పోషించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి, నేటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయిన నీలం సహానీని విచారిస్తే సీఐడీ చీఫ్ కు కార్పొరేషన్ పుట్టుక అక్రమమో, సక్రమమో తెలుస్తుందని పట్టాభి స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు విడుదల చేసిన అజయ్ కల్లంను అడిగినా మీకు మరింత సమాచారం అందచేస్తారని అన్నారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇసుక రద్దు చేసి కార్మికులను రోడ్డున పడేశారు, ప్రజావేదిక కూల్చారు. వీరిద్దరి మధ్య తేడాను ప్రజలు గమనించుకోవాలి. అభివృద్ధి నిర్మాత చంద్రబాబైతే… అభివృద్ధి విధ్వంసకుడు జగన్‌రెడ్డి. జగన్‌రెడ్డి ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. తప్పుడు సమాచారం ప్రచారం చేయడానికి ఢిల్లీ వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టిన సీఐడీ చీఫ్ చంద్రమండలానికి వెళ్లి పత్రికా సమావేశం పెట్టినా ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు.’’ అని పట్టాభి పేర్కొన్నారు.