వాట్సాప్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి ఛానెల్స్‌ ఫీచర్‌

-

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్స్ లో ఉన్న ‘ఛానెల్స్ ఫీచర్’ను ఇప్పుడు వాట్సాప్ లో తీసుకొచ్చింది. భారత్ సహా మొత్తం 150 దేశాల్లో ఈ ఫీచర్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కొంత మంది వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే అసలు ఈ వాట్సాప్ ఛానల్స్ అంటే ఏంటి? వాట్సాప్ లో స్టేటస్ ప్లేస్ లో అప్ డేట్స్ అని కనిపిస్తుంది? ఈ అప్ డేట్ ఏంటి? దీన్ని ఎలా వాడాలని చాలా మందిలో ఓ ప్రశ్న మెదులుతోంది. ఈ ఛానెల్స్ ఫీచన్ ఎలా వాడాలంటే..?

New WhatsApp beta includes a 'channels' feature. Here's how it works | ZDNET

అయితే.. దిగ్గజ సెలబ్రిటీల నుంచి మొదలుకుని సాధారణ ప్రజలు కూడా ఛానెల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. సినిమా స్టార్స్, క్రికెటర్స్, రాజకీయ నాయకులు, వివిధ కంపెనీలకు చెందిన అధికారులు, వ్యాపారవేత్తలు, మీడియా, ప్రభుత్వ విభాగాలు, ఫుడ్, ట్రావెల్, తదితర అన్ని విభాగాలకు ప్రత్యేకంగా ఛానెల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది అచ్చం టెలిగ్రామ్ మాదిరిగా ఉంటుంది. యూజర్లు కేటగిరీల వారిగా తమకు నచ్చిన విభాగాన్ని ఎంచుకుని ఫాలో కావచ్చు. ఇలా ఫాలో కావడం ద్వారా ఆయా ఛానెల్స్‌లో వచ్చే కంటెంట్‌ను చూడవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news